రష్యాపై ఒత్తడి పెంచుతున్న బైడెన్…. ఉక్రెయిన్ మంత్రులతో పోలాండ్ లో భేటీ

-

ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం ప్రారంభమై 31 రోజులకు చేరింది. రష్యాకు ఉక్రెయిన్ లొంగడం లేదు. కేవలం మూడు నాలుగు రోజుల్లోనే ముగుస్తుందనుకున్న యుద్ధం ఇప్పుడు నెల రోజులు గడిచింది. ఇదిలా ఉంటే రష్యాపై పశ్చిమ దేశాలు ఎన్ని ఆంక్షలు విధించినా…లెక్క చేయడం లేదు. ఉక్రెయిన్ ప్రధాన నగరాలను ధ్వంసం చేస్తోంది రష్యన్ ఆర్మీ. 

ఇదిలా ఓ వైపు యుద్ధం జరుగతున్న సమయంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ సరిహద్దు దేశం పోలాండ్ వెళ్లారు. రష్యాపై మరింత ఒత్తడి పెంచేందుకు ప్రయత్నిస్తోంది అగ్రరాజ్యం అమెరికా. పోలాండ్ లో ఉక్రెయిన్ మంత్రులతో సమావేశం అయ్యారు జోబైడెన్. ఉక్రెయిన్ కు తమ మద్దతు ప్రకటించడంతో పాటు మరింతగా సైనిక, ఆర్థిక సాయం అందేలా జోబైడెన్ భేటీ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. రష్యాకు తలవంచేది లేదంటూ… తన భూభాగాలను అప్పగించేది లేదంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ స్పష్టం చేశారు.

ఇప్పటి వరకు తొలి దశ యుద్ధం పూర్తియిందని రష్యా తెలిపింది. రెండో దశలో డాన్ బాస్క్ ఉక్రెయిన్ నుంచి విముక్తి కల్పిస్తామని… క్రిమియా లాగే డాన్ బాస్క్ ను తమ అధీనంలోకి తీసుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. లూహాన్స్క్, డొనెట్స్క్ రీజియన్లను స్వతంత్రత ప్రకటించింది రష్యా.

Read more RELATED
Recommended to you

Exit mobile version