తెలంగాణలో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం.. ఎండాకాలం కరెంటు కోతలు ?

-

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతోంది. అయినా రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ ఫీక్ డిమాండ్ ను అధిగమించాయి విద్యుత్ సంస్థలు. ఇవాళ మధ్యాహ్నం 2.57 నిమిషాలకు 13742 మెగా వాట్స్ డిమాండ్ ఉంది. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇంత డిమాండ్ రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. గత సంవత్సరం మార్చి 31న 13688 మెగా వాట్స్ అత్యధిక డిమాండ్ నమోదు కాగా గత రికార్డ్స్ తిరుగరాస్తూ ఈసారి ఏకంగా 13742 మెగా వాట్స్ డిమాండ్ నమోదు అయింది.

గ్రేటర్ హైదరాబాద్ నగరంలో సైతం భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం పెరిగిందని ప్రభాకర్ రావుట్రాన్స్ చెప్పారు. గత ఏడాది గ్రేటర్ హైదరాబాద్ లో 55 మిలియన్ యూనిట్స్ దాటాని విద్యుత్ వినియోగం ఈసారి మర్చిలోనే 65 మిలియన్ యూనిట్స్ డిమాండ్ పెరిగిందని వెల్లడించారు.

గత సంవత్సరం మార్చి 31న 13688 మెగా వాట్ల పీక్ డిమాండ్ నమోదు అయిందని.. ఇవాళ ఏకంగా 13742 మెగా వాట్ల ఫీక్ డిమాండ్ నమోదు అయిందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ సంవత్సరం 14500 మెగావాట్స్ ఫీక్ డిమాండ్ నమోదు అయ్యే అవకాశం ఉందని చెప్పారు. రానున్న రోజుల్లో మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందని.. ఎండా కాలంలో కరెంట్ కోతలు లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version