రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. ఎనిమిదో రోజు కూడా రష్యా సేనలు ఉక్రెయిన్ పై భీకరంగా విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా ఖార్కీవ్, కీవ్ నగరాలపై రాకెట్లతో దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే ఈరోజు రెండో దశ చర్చలకు ఇరు దేశాలు సిద్ధం అయ్యాయి. బెలారస్ వేదికగా ఈ చర్చలు జరుగబోతున్నాయి. ప్రస్తుతం జరిగే ఈ చర్చలపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచుస్తున్నాయి.
ఇదిలా ఉంటే రష్య సంచలన ఆరోపలు చేసింది. ఉక్రెయిన్ సైన్యం భారత విద్యార్థులను బంధించి మానవ కవచాలుగా ఉపయోగించుకుంటుందని సంచలన ప్రకటన చేసింది. తాజా సమాచారం ప్రకారం, భారతీయ విద్యార్థులను ఉక్రేనియన్ భద్రతా దళాలు బందీలుగా పట్టుకున్నాయి మరియు వారిని మానవ కవచంగా ఉపయోగించుకుంటాయి మరియు రష్యాకు వెళ్లకుండా వారిని అన్ని విధాలుగా నిరోధించాయి. బాధ్యత పూర్తిగా కీవ్ అధికారులపై ఉంది. ” అంటూ భారత్ లోని రష్యన్ ఎంబసీ ట్విట్ చేసింది. అయితే ఈ ఆరోపణలపై ఉక్రెయిన్ స్పందించలేదు.