రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకునే దిశలో రష్యన్ సేలను ఉన్నాయి. మరో 72 గంటల్లో కీవ్ నగరం రష్యా వశం కానుంది. ఇటు యుద్ధం చేస్తూనే మరోవైపు రష్యా, ఉక్రెయిన్ తో చర్చలు జరుపుతోంది. యుద్ధం యుద్ధమే.. చర్చలు చర్చలే అని గతంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బెలారస్ వేదికగా మూడు సార్లు చర్చలు జరిగినా… ఎలాంటి ఫలితం రాలేదు.
ఇదిలా ఉంటే రేపు టర్కీ వేదికగా… రష్యా, ఉక్రెయిన్ మధ్య కీలక చర్చలు జరుగనున్నాయి. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కుబేలా మధ్య కీలక చర్చలు జరుగనున్నాయి. ఈ క్రమంలో టర్కీ రాయబారం ఫలించేలా కనిపిస్తోంది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చేతులెత్తేశాడు. రష్యా ధాటికి తట్టుకోలేక యుద్ధం విరమించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాము నాటో కూటమిలో చేరమని స్పష్టం చేశారు. నాటో మాకు సహకరించడం లేదని అన్నారు. మరోవైపు రష్యా కూడా జెలెన్ స్కీ లొంగిపోతే యుద్ధం ఆపే ఆలోచనలో ఉంది. మరో రెండు మూడు రోజుల్లో యద్ధం ముగియవచ్చని పలు దేశాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.