బ్రేకింగ్ : ఉక్రెయిన్‌లో మరో భారతీయుడు మృతి

-

ఉక్రెయిన్ దేశం లో మరో భారతీయుడు మృతి చెందాడు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన… మరో విద్యార్థి… ఉక్రెయిన్ దేశం లో మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. జిందాల్ ఇస్కీమిక్ స్ట్రోక్‌ అనే వ్యాధి కారణంగా మృతి చెందినట్లు సమాచారం అందుతోంది.  ఈ విషయాన్ని కాసేపటి క్రితమే భారతీయ విదేశాంగ శాఖ ధృవీకరించింది.

పంజాబ్ బర్నాలా కు చెందిన భారతీయ విద్యార్థి మృతి చెందినట్లు భారతీయ విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన చేసింది. “ఉక్రెయిన్‌లో వైద్య విద్యార్థి చందన్ జిందాల్ (22) ఇ స్కీమిక్ స్ట్రోక్‌ తో విన్నిట్సియా అత్యవసర ఆసుపత్రిలో చేరాడు. అయితే ఆస్పత్రికి చేరే ముందే తుది శ్వాస విడిచాడు. చందన్ జిందాల్ (22) విన్నిట్సియా ఉక్రెయిన్‌లోని విన్నిట్సియా నేషనల్ పైరోగోవ్ మెమోరియల్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. అతని మృతదేహాన్ని తీసుకురావడానికి ఏర్పాట్లు చేయాలని అతని తండ్రి భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. ” అంటూ విదేశాంగ శాఖ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version