ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. యుద్ధం ప్రారంభం అయి నేటికి.. పదకొండు రోజులు గడుస్తోంది. ఉక్రెయిన్ ను ఆయుధ రహితంగా చేయడమే లక్ష్యంగా రష్యా సైనిక బలగాలు దాడులు చేస్తున్నాయి. భారీ ఎత్తున్న క్షిపణులు, బాంబులతో రష్యా బలగాలు.. ఉక్రెయిన పై విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ కు చెందిన పలు నగరాలను, అను విద్యుత్ కేంద్రాలను రష్యా ఆక్రమించుకుంది. అలాగే ఉక్రెయిన్ దేశ రాజధాని కీవ్ నగరాన్ని ఆక్రమించుకోవడమే లక్ష్యంగా రష్యా సైనిక బలగాలు ముందుకు సాగుతున్నాయి.
కాగ ఉక్రెయిన్ పై చేస్తున్న యుద్ధాన్ని రష్యా సమర్థించుకుంది. యుద్ధానికి గల కారణాలను ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమర్థించుకున్నారు. ఉక్రెయిన్ పై యుద్ధం చేయడం ఒక కఠిన మైన నిర్ణయం అని అన్నారు. ఉక్రెయిన్ పై దాడి చేయాలని తాము అనుకోలేదని అన్నారు. కానీ ఉక్రెయిన్ ప్రభుత్వ పరిస్థితులను బట్టి యుద్ధం తప్పలేదని అన్నారు.
ముఖ్యంగా డాన్ బాస్ ప్రజల పట్ల ఉక్రెయిన్ ప్రభుత్వం అణచివేతకు పాల్పడిందని ఆరోపించారు. అందుకే తాము యుద్ధం చేయాల్సి వస్తుందని వివరించారు. ఉక్రెయిన్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు ప్రధాన కారణం.. ఆ దేశ ప్రభుత్వమే అని అన్నారు.