యాదాద్రి: శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు దినం, స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు. ఆలయ పురవీధులు, ప్రసాద కౌంటర్లు, వ్రత మండపాలతో పాటు క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. కొండపైన ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్న దృష్ట్యా వాహనాలను అనుమతించడం లేదు.