అమెరికా మిత్ర దేశాలతో బైడెన్ సమావేశం… రష్యాకు వ్యతిరేఖంగా కీలక నిర్ణయం..!

-

ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండిస్తున్నాయి ప్రపంచ దేశాలు. ముఖ్యంగా యూరప్ దేశాలతో పాటు జపాన్, కెనడా, అమెరికా దేశాలు రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యాపై పలు ఆర్థిక ఆంక్షలను కూడా విధించాయి. రష్యా బ్యాంకుల సేవల్ని బ్లాక్ చేశాయి. ఇదిలా ఉంటే రష్యాతో ఉన్న సంబంధాలను తెగదెంపులు చేసుకునేందుకు పలు యూరోపియన్ దేశాలు కూడా సిద్ధపడుతున్నాయి. ఇప్పటికే రష్యా విమానాలు తమ గగనతలం నుంచి వెళ్లేందుకు యూరప్ దేశాలు నిషేధించాయి. ఈ నిషేధం నేటి నుంచి అమలులోకి రానుంది. 

ఇదిలా ఉంటే పెద్దన్న అమెరికా నేడు తన మిత్ర దేశాలతో సమావేశం కానుంది. ఈ మేరకు బైడెన్ అమెరికా మిత్ర దేశాలతో భేటీ కానున్నారు. నాటో, యూరప్ దేశాలు, యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, పోలాండ్, జపాన్ దేశాల అధినేతలతో బైడెన్ భేటీ కానున్నారు. ఉక్రెయిన్- రష్యా యుద్ధం నేపథ్యంలో ఈ భేటీ జరుగనుంది. ఈ భేటీలో రష్యాకు వ్యతిరేఖంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version