ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై UN జనరల్ అసెంబ్లీ తీర్మానం.. మరోసారి ఓటింగ్​కు భారత్​ దూరం

-

ఉక్రెయిన్‌పై యుద్ధానికి రష్యా ముగింపు పలకాలని, వెంటనే రష్యా బలగాలు అక్కడి నుంచి వైదొలగాలని డిమాండ్‌ చేస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది. 193 సభ్యదేశాలు ఉన్న జనరల్‌ అసెంబ్లీలో.. 141 దేశాలు తీర్మానానికి అనుకూలంగానూ, 7 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. భారత్‌, చైనా సహా మరో 30 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.

ఈ సమావేశంలో ప్రసంగించిన చైనా రాయబారి.. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరిగేందుకు తాము మద్ధతునిస్తామని పేర్కొన్నారు. ఈ యుద్ధం విషయంలో బాధ్యుడిని, బాధితుడిని సమానంగా చూడలేమని.. ఐరోపా సమాఖ్య విదేశాంగ శాఖ చీఫ్‌ జోసెఫ్‌ బోరెల్‌ తెలిపారు.

భారతదేశ శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ భద్రతా మండలి ప్రాథమిక నిర్మాణాన్ని ప్రశ్నించారు. శాశ్వత శాంతిని భద్రపరచాలనే ఉద్దేశంతోనే తాము ఓటింగ్​కు దూరంగా ఉన్నట్లు చెప్పారు. ఇది యుద్ధయగం కాదన్న ప్రధాని నరేంద్ర మోదీ మాటలను గుర్తుచేసిన ఆమె.. మనుషుల ప్రాణాలను పణంగా పెడితే సమస్యలకు ఎప్పటికీ పరిష్కారం దొరకదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version