ఆసియా అంతా విపరీతమైన వేడి కారణంగా చాలామంది ప్రజల పై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ చెప్పింది. తూర్పు ఆసియా పసిఫిక్ అంతట 243 మిలియన్ల కంటే ఎక్కువ మంది పిల్లలు వేడి సంబంధిత అనారోగ్య సమస్యలు వలన మరణాల ప్రమాదం లో ఉన్నారని ఈ ప్రాంతంలో రాబోయే నెలలో రికార్డు స్థాయిలో వేడి తిరిగే అవకాశం ఉంటుందని ఏజెన్సీ చెప్పింది.
ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి తీవ్రమైన వేడిగాలులు ఆందోళనని కలిగిస్తున్నాయి. అధిక తేమ స్థాయిలు శరీరం సహజంగా చల్లబడడానికి మరింత కష్టతరం చేస్తాయని యుఎన్ అంది. యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ ప్రకారం పెద్ద వాళ్ళతో పోల్చుకుంటే పిల్లలు వేడిగాలుడికి ఎక్కువగా అనారోగ్య సమస్యకి గురవుతారని తెలుస్తోంది.