ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కవితకు మరో సారి షాక్ తగిలిందనే చెప్పాలి. మనీ లాండరింగ్ కు సంబంధించి ఈడీ కేసులో ఇప్పటికే ఆమె తీహార్ జైలులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. తాజాగా కవితను గురువారం ఈ కేసులో సీబీఐ అరెస్ట్ చేసింది. లిక్కర్ కేసుకు సంబంధించి కవితను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం అందుకు అనుమతి ఇచ్చింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వరుస షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. తీహార్ జైలులో ఉన్న కవితను విచారిస్తున్న సీబీఐ అధికారులు కస్టడీలో తీసుకున్న సంగతి అందరకీ తెలిసిందే. అయితే ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరచనున్నట్టు సమాచారం. విచారణ కోసం 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరనున్నట్టు సమాచారం. ఇందుకు కోర్టు అనుమతి ఇస్తుందో లేదో వేచి చూడాలి మరీ.