వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పార్టీ ఫిరాయింపులను సీరియస్‌గా తీసుకుంటున్న విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలనే విధంగా చర్యలు మొదలు పెట్టింది. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలపై అనర్హత వేటు వెయ్యాలని తమ్మినేని సీతారాంకు వైసీపీ సోమవారం కంప్లైంట్ చేసింది.
సీ.రామచంద్రయ్య, వంశీకృష్ణ యాదవ్ పై అనర్హత వేటు వేయాలని కూడా మండలి ఛైర్మన్‌ను కోరింది. టీడీపీ లో నలుగురు ఎమ్మెల్యేలు చేరారు. ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేన లో చేరారు. సీ. రామ చంద్రయ్య టీడీపీ లో చేరారు. అనర్హత వేటు పై స్పీకర్‌కు వైసీపీ ఫిర్యాదు చేయడం పై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పందించారు. నోటీసులు పంపినట్లు మీడియాలోనే చూసినట్లు చెప్పారామె. ఏ నోటీసులు రాలేదన్నారు.