తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజా పాలన దరఖాస్తుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం. ప్రతీ పైసా రాష్ట్ర ప్రజలు అవసరాల కోసమే ఖర్చు చేస్తాం. ఫార్ములా ఈ రేస్ పై మాజీ మంత్రులు అనవసర ఆరోపణలు చేస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ పై ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టింది. ఫార్ములా ఈ రేసులో ముగ్గురు వాటాదారులున్నారు.
ఫార్ములా ఈ రేసు పై మాజీ మంత్రులు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. ఫార్ములా ఈ రేస్ తో రాష్ట్రానికి వచ్చేది ఏమి లేదు. ఫార్ములా ఈ రేస్ పై ట్రై పార్టీ అగ్రిమెంట్ జరిగింది. సెక్రెటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం.. అనుమతి లేదు. ఫార్ములా ఈ రేస్ వెనక్కి వెళ్లడంతో ప్రభుత్వానికి నష్టం జరిగిందని పేర్కొంటున్నారు. జరిగిన నష్టాన్ని ప్రభుత్వం కాపాడుతుంటే.. మాజీ మంత్రులు మాత్రం రాష్ట్రానికి నష్టం చేస్తున్నారని పేర్కొంటున్నారు. బిజినెస్ రూల్స్ కి భిన్నంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించింది.