మన ఆలోచనలను అర్థం చేసుకుందాం

-

మనం ఏ లక్ష్యం కోసమైతే పరితపించి జ్ఞానేంద్రియాలనూ, భౌతిక శక్తులను కేంద్రీకరిస్తున్నామో ఆ లక్ష్యం సాకారం అవదన్న సందేహం చుట్టుముట్టిన క్షణం మనసు గమనం అస్థిరమవుతుంది.

 

కక్ష్య నుండి వేరుపడిన ఉపగ్రహంలా గమ్యమెరుగక కొట్టు మిట్టాడుతుంది. ఆ అసహనాన్ని భరించలేక మానసిక శక్తులను ప్రోదిచేసుకుని బలవంతంగా మళ్లీ ఏదో ఒక లక్ష్యం వైపు మళ్లించబడనిదే మనసుకు ఊరట లభించదు.

అందుకే,  మనసుకి ఏ ఆలంబనా లభించనప్పుడు అంతర్ముఖులమై మనల్ని మనం తరచిచూసుకునే ధైర్యం చాలక లౌకిక ప్రపంచంలోని పరిసరాల తీరుతెన్నులు, మనుషుల ప్రవర్తనని బేరీజు వేయడానికి పూను కుంటాం.

 

మన ఆలోచనల్ని సరిచేసుకునే ప్రయత్నం నుండి పారిపోయి ప్రపంచంలో కలిసిపోయి వేలెత్తిచూపడానికి ఉద్యుక్తులమవుతాం. ప్రతీ మనిషికీ ఒంటరిగా ఉండడం కన్నా సమూహంలో భాగంగా ఉండడమే ఎంత ఇష్టమో గమనిస్తే మనల్ని మనం ఎంత ఆస్వాదించు కుంటున్నామో, మన అస్థిత్వాన్ని మనమొక్కళ్లమే ఎంత కోరుకుంటున్నామో అర్థమవుతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news