రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రబీ పంటలకు కనీసం మద్దతును పెంచుతూ.. కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రబీ సీజన్ లో పంటలు వేసే రైతులందరికీ ఈ నిర్ణయం వర్తించనుంది. వేర్వేరు పంటలకు కనీసం 40 రూపాయల నుంచి 400 వరకు కనీస మద్దతు ధర పెంచిన కేంద్ర ప్రభుత్వం.
ముఖ్యం గా గోధుమలు, బార్లీ, శనగలు, చెరకు, ఆవాలు లపై కనీస మద్దతు ధరలు పెంచిన కేంద్రం. 2022 – 23 మార్కెటింగ్ సీజన్కు ఈ కొత్త కనీస మద్దతు ధరలు వర్తించ నున్నాయి. క్వింటాల్ చెరకు మద్దతు ధర రూ. 290 ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అలాగే గోధుమల పై 40 రూపాయలు మరియు బార్లీ 35 రూపాయలు, శనగలపై 350 రూపాయలు మద్దతు ధర పెంచింది కేంద్ర ప్రభుత్వం. పెరిగిన ధరలతో క్వింటాల్ గోధుమలకు రూ. 2015 మద్దతు ధర లభించనుంది. ఇక పెంచిన ధరల తో దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు కాస్త ఊరట లభించనుంది.