హుజురాబాద్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా !

-

హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం రసవత్తరంగా కొనసాగుతోంది. నోటిఫికేషన్ రాకముందు అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. అధికార టిఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి తమ అభ్యర్థిని కూడా ప్రకటించింది. దీంతో విపక్ష కాంగ్రెస్ పార్టీ మరియు బిజెపి పార్టీలు డిఫెన్స్ లో పడి పోయాయి. ఈ నేపథ్యంలోనే బిజెపి పార్టీ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలవాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే హుజురాబాద్ ఎన్నికల ప్రచారాన్ని మరింత… హీట్ ఎక్కిచ్చేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రంగంలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణ విమోచన/ విలీన దినం అయినా సెప్టెంబర్ 17వ తారీఖున అమిత్ షా హుజూరాబాద్ నియోజకవర్గం లో పర్యటిస్తారని బిజెపి పార్టీ వర్గాలు తాజాగా పేర్కొన్నాయి. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సమయంలో… బీజేపీ హైకమాండ్ నేతలు ఎవరూ కూడా అక్కడ పర్యటించలేదు. కానీ హుజురాబాద్ ఉప ఎన్నికలు సీరియస్ గా తీసుకున్నారు. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని బిజెపి చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా హుజరాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి పార్టీ తరఫున ఈటెల రాజేందర్ బరిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version