రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కౌంటర్

-

చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే కేంద్ర సర్కార్ నిద్రపోతోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. రాహుల్ వ్యాఖ్యలపై తాజాగా కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మండిపడ్డారు. డోక్లాం ప్రతిష్టంభన సమయంలో చైనీస్‌ అధికారులతో కలిసి విందు ఆరగించిన వారికి(రాహుల్‌ను ఉద్దేశిస్తూ) ప్రశ్నలు అడిగే అర్హత లేదంటూ కాంగ్రెస్‌ నేతను దుయ్యబట్టారు.

‘‘తవాంగ్‌ అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించే ముందు.. రాహుల్‌జీ ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. డోక్లాం విషయంలో భారత సైన్యం.. చైనా బలగాలతో పోరాటం చేస్తున్నప్పుడు మీరు చైనీస్‌ అధికారులతో కలిసి ఏం చేస్తున్నారు? ఆ సమయంలో ఆయన ఆర్మీని ప్రశ్నించారా? చైనీస్‌ అధికారుల నుంచి రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌ విరాళాలు తీసుకోవట్లేదా? వీటిపై రాహుల్‌జీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు’’ అని ఠాకూర్‌ ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. సాయుధ బలగాలకు బులెట్‌ప్రూఫ్‌ జాకెట్లు, రఫేల్‌ యుద్ధ విమానాల వంటి అత్యాధునిక సదుపాయాలు/ఆయుధాలను కల్పించలేదని అనురాగ్‌ ఠాకూర్‌ విమర్శించారు. మోదీ హయాంలో తమ ప్రభుత్వం ఉగ్రవాదంపై కఠిన నిర్ణయాలు తీసుకోవడమే గాక, అవి సత్ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version