బ్రేకింగ్ : కేంద్ర మంత్రి రాజీనామా.. ఎందుకంటే ?

-

కేంద్ర మంత్రి ఒకరు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. రైతాంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లుకు ఎన్.డి.ఏ లోనే వ్యతిరేకత వచ్చినట్టు అయింది. బిల్లుకు ఎన్.డి.ఏ కూటమిలో అత్యంత విశ్వసించదగ్గ భాగస్వామ్య పక్షమైన అకాలీదళ్ వ్యతిరేకత వచ్చింది. బిల్లుకు వ్యతిరేకంగా మంత్రి పదవికి కేంద్ర ఆహారోత్పత్తుల శాఖ మంత్రి హరిసిమ్రత్ కౌర్ రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ భర్త శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారు.

లోకసభ నుంచి వాకౌట్ చేసి ప్రధాని కార్యాలయానికి రాజీనామా సమర్పించేందుకు వెళ్లిన హర్ సిమ్రత్ కౌర్ అక్కడే రాజీనామా లేఖను సమర్పించినట్టు సమాచారం. ఈ రోజు మధ్యాహ్నం పార్లమెంట్ ప్రాంగణంలో కూడా ధర్నా నిర్వహించి బిల్లు కాపీలను హరిసిమ్రత్ దగ్ధం చేసినట్టు సమాచారం. తొలుత బిల్లుకు మద్దతు ఇచ్చిన అకాలీదళ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు గత కొన్ని రోజులుగా బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలతో వెనక్కు తగ్గింది. రైతుల నిరసనల సెగ పెరగడంతో, హరిసిమ్రత్ కౌర్ రాజీనామా కు నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news