వరి ధాన్యం కొనుగోలు విషయంలో సాక్షాత్తు కేంద్ర మంత్రే అబద్ధాలు చెబుతున్నారని.. ఇది చాలా బాధాకరం అని రాష్ట్ర వ్యవసాయ శా మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పది లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేంద్రానికి పంపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అందుకు రైల్వే రేకులు, గోదాములు చూపిస్తే.. ఈ పది లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిస్తామని కేంద్రానికి చెప్పామని అన్నారు. కానీ కర్ణాటక తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఫర్టి లైజర్ ఒత్తిడి వల్ల రేకులు డైవర్ట్ చేయాల్సి వచ్చిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయాల్ చేప్పారని అన్నారు.
దీని వల్లే తెలంగాణకు రైల్వే రేకులు ఇవ్వలేకపోయమాని కేంద్ర మంత్రి అన్నారని నిరంజన్ రెడ్డి వివరించారు. కానీ ఇప్పుడుమో.. అదే కేంద్ర మంత్రి అబద్ధాలను చెబుతున్నారని అన్నారు. కేంద్రం తీసుకుంటామని చెప్పినా.. తెలంగాణయే ఇవ్వలేదని అంటూ అబద్ధాలను చెబుతున్నారని అన్నారు. సాక్షాత్తు ఒక కేంద్ర మంత్రే ఇలా అబద్ధాలు చెప్పడం బాధాకరం అని అన్నారు.
బియ్యం రాష్ట్రం వద్ద ఎందుకు ఉంచుకుంటామని అన్నారు. దాంతో ఎమైనా లాభం ఉంటుందా.. అని అన్నారు. కాగ ఈ రోజు మంత్రులు గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ తో కలిసి ఢిల్లీవి వెళ్తున్నామని అన్నారు. కేంద్ర మంత్రి స్పందనను బట్టి భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని ప్రకటించారు.