హాట్‌ సమ్మర్‌లో కూల్‌గా బరువు తగ్గాలనుకునే వారికి సోంపు షర్బత్..!

-

వేసవికాలంలో వేడిని తట్టుకోవడం కాస్త కష్టమైన పనే.. ఎప్పుడూ చెమటతో చిరాకుగా ఉంటుంది. ఏది తినాలనిపించదు. బాగా కూల్ డ్రింక్స్ తాగాలని ఉంటుంది. అలా అని తాగితే.. హెల్త్ కి మంచిది కాదు. వేసవిలో మంచి షర్భత్ చేసుకుని కూల్ గా ఎంజాయ్ చేస్తూ తాగుతూ.. బరువు కూడా తగ్గొచ్చు. వేసవి తాపానికి చక్కటి పానీయం (వరియాలి) సోంపుల షర్బత్. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాం.

సోంపు గింజల షర్బత్ కోసం..

దీన్ని చేయడం కోసం..
1/4 కప్పు సోపు గింజలు,
1/4 కప్పు పంచదార,
3 యాలుకలు,
1 టీస్పూన్ నల్ల ఉప్పు,
1 టేబుల్ స్పూన్ నిమ్మరసం,
2 టేబుల్ స్పూన్ల తులసి గింజలు,
చల్లని నీరు

వరియాలి షర్బత్ ఎలా తయారు చేయాలంటే..?

ముందుగా తులసి గింజలను నీటిలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. మిక్సి జార్‌లో సోంపు గింజలను వేయండి.. దీని తర్వాత పచ్చి యూలకులు, పంచదార వేయాలి. ఆ తర్వాత మిక్సిలో మెత్తగా గ్రైండ్ చేయండి. ఒక పెద్ద జగ్‌లో 3 టేబుల్‌స్పూన్ల సొంపు గింజల పొడి, ఉప్పు, నిమ్మరసం, తగినంత చల్లని నీరు వేసి బాగా కలపాలి. మిశ్రమాన్ని ఫిల్టర్ చేసి గ్లాసుల్లో పోయాలి. నానబెట్టిన తులసి గింజలను ఒక గ్లాసులో పోసి కలపాలి. అంతే షర్భత్ రెడీ.

వరియాలి.. ఆరోగ్య ప్రయోజనాలు

సోంపులో మాంగనీస్, మెగ్నీషియం, ఫైబర్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉన్నాయి.
సోంపు శరీరాన్ని చల్లబర్చుతుంది.
సోంపు గింజల్లో విటమిన్లు, మినరల్స్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు సోంపు గింజలు పని చేస్తాయి.
ఒక గ్లాసు ఫెన్నెల్ జ్యూస్ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
సోంపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్లు, వైరస్‌లను దూరంగా ఉంచుతాయి.
సోంపులోని పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.

ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి.. సోంపు షర్భత్ ను డైలీ చేసుకుని ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తూ తాగేయండి మరీ..!

 

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news