ఉద్యమ ద్రోహులకు టీఆర్ఎస్ అడ్డాగా మారింది : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

-

హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక తేదీ తరుముకొస్తున్న వేళ… అధికార టీఆర్ఎస్ పార్టీ మరియు భారతీయ జనతా పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే నిన్న టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో బిజెపి పార్టీ మరియు ఎన్నికల కమిషన్ పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫైర్ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం తమ పట్ల దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు సీఎం కేసీఆర్.

అయితే తాజాగా కేసీఆర్ వ్యాఖ్యలకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గం లో ప్రచారం నిర్వహించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి… సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు.

టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ ద్రోహులకు.. ఉద్యమ వ్యతిరేకులకు అడ్డాగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు తెలంగాణ పోరాటాన్ని అణచి వేసిన వాళ్లే ఉద్యమకారులను వేధించిన వాళ్లే కెసిఆర్ దగ్గర కనిపిస్తున్నారని నిప్పులు చెరిగారు. కెసిఆర్ కైనా సామాన్య కార్యకర్తగా ఆయన తన కైనా ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఒకటేనని చురకలు అంటించారు. ఎన్నికల సభలు పెట్టుకోకుండా చేశారని కేసీఆర్.. తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version