హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌ను క‌లిసిన కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

-

రెండు నెల‌ల క్రితం హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌కు రోడ్డు ప్ర‌మాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో సాయిధ‌ర‌మ్ తేజ్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ప్ర‌మాదం త‌ర్వాత దాదాపు 40 రోజుల పాటు ఆస్ప‌త్రిలోనే చికిత్స తీసుకున్నాడు. అయితే సాయి ధ‌ర‌మ్ తేజ్ ఇటీవ‌ల ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జీ అయ్యాడు. అంతే కాకుండా గాయం నుంచి కూడా కోలుకుంటున్నాడు. అయితే ఈ రోజు హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ఇంటికి కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి వెళ్లి ప‌రామర్శించారు. సాయి ధ‌రమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురంచి అడిగి తెలుసుకున్నారు.

ఈ విష‌యాన్ని హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌న ట్వీట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలిపాడు. అలాగే ఫోటోల‌ను కూడా షేర్ చేశాడు. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి బిజీ ప‌ర్య‌ట‌న లో ఉన్నా.. త‌న‌ను క‌ల‌వ‌డానికి రావ‌డం సంతోషంగా ఉంద‌ని అన్నారు. అందుకు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. కాగ రోడ్డు ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ తీవ్రంగా గాయ ప‌డ్డాడు. 40 రోజుల పాటు ఆపోలో ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకున్న త‌ర్వాత త‌న పుట్టిన రోజున ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జీ అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version