జీవో 317 ను సవ‌రించాలి : ఎమ్మెల్యే రాజాసింగ్

-

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తుంద‌ని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆగ్ర‌హాం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన జీవో నెంబ‌ర్ 317ను వెంట‌నే సవ‌రించాల‌ని డిమాండ్ చేశారు. అలాగే దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్ర‌తినిధుల‌తో ప్ర‌భుత్వం చ‌ర్చించాల‌ని అన్నారు. జీవో 317 ను స‌వ‌రించిన త‌ర్వాతే ఉద్యోగుల బ‌దిలీలు, నియ‌మ‌కాలు చేపట్టాల‌ని అన్నారు. బ‌దిలీల విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు నిద్ర లేకుండా చేస్తుంద‌ని అన్నారు.

దీంతో ఉద్యోగులు మాన‌సిక క్షోభకు గురి అవుతున్నార‌ని విమ‌ర్శించారు. బ‌దిలీల విష‌యం సోష‌ల్ మీడియా ద్వారా తెలప‌డం ఎంట‌ని ప్ర‌శ్నించారు. ఉద్యోగుల‌కు అండ‌గా బీజేపీ ఉంటుంద‌ని అన్నారు. అలాగే ఉద్యోగుల విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం వ‌హిస్తున్న నిర్లక్షాన్ని నిర‌సిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎంపీ బండి సంజ‌య్ జాగ‌ర‌ణ చేస్తార‌ని ప్ర‌కటించారు. రేపు రాత్రి 9 గంట‌ల నుంచి సోమవారం ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు ఎంపీ బండి సంజ‌య్ జాగ‌ర‌ణ చేస్తార‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version