కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఇక ఆయన పర్యటనకు రాష్ట్ర బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ప్రత్యేక విమానంలో రాజ్నాథ్ సింగ్ ఢిల్లీ నుంచి బయల్దేరి గన్నవరం చేరుకుంటారు.విమానాశ్రయం వద్ద ఆయనకు స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం వైజాగ్, విజయవాడ, ఏలూరు పర్యటనలకు వెళ్లనున్నారు.
రాజ్నాథ్ సింగ్ పర్యటన షెడ్యూల్ ఇదే..
వైజాగ్ లో VUDA చిల్డ్రన్స్ థియేటర్లో 12 గంటలకు మేధావుల సమావేశం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు వైజాగ్ నుంచి విజయవాడ చేరుకుంటారు.
విజయవాడలో ఒక హోటల్లో బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ లోక్సభ స్థానాల కోర్ కమిటీతో సమావేశం కానున్నారు.
సాయంత్రం 5:10కి ఏలూరు ఇండోర్ స్టేడియంలో కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొననున్నారు.
సాయంత్రం 7:10 కి గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీ పయనం కానున్నారు.