అలంకారానికి ఉపయోగించే నగలు వెనుక తెలియని నిజాలు…!

Join Our Community
follow manalokam on social media

అలంకారానికి ఉపయోగించే నగలు వెనుక కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేంటి అంటే..? గర్భకోశము కదలి లోపల ఉన్న శిశువు వికారంగా పుట్టకుండా ఉండడానికి వడ్డాణము సహాయ పడుతుంది. అలానే బంగారాన్ని ఏ రూపంగా ధరించినా ఎంతో కొంత శక్తి శరీరానికి సంక్రమిస్తుంది. ఇక ముక్కెర విషయానికి వస్తే.. దీన్ని ధరించటం వల్ల మాట్లాడే సమయం లో పై పెదవికి తగిలి వీలు అయినంత తక్కువ మాట్లాడమని చెప్పడం జరుగుతుంది.

ఇది ఇలా ఉండగా ముక్కెర ధరించటం వల్ల ముక్కు కొన పై ఏదో విధంగా దృష్టి ఉంటుంది. అయితే అలా దృష్టి ఉండటం ధాన్యం లో ఒక భాగం అని అంటారు. అలానే చెడు శ్వాస కలిగిన గాలిని బంగారు ముక్కెర పవిత్రం చేస్తుంది. చంద్ర వంకని శిరో మధ్య ప్రదేశం లో ధరిస్తారు. ఆ ప్రాంతం నుంచే మన జీవనాధారమైన ప్రాణ వాయువు బ్రహ్మ రంధ్రం నుంచి హృదయం లోకి ప్రవేశిస్తాడు. దీని మూలం గానే ఆ భాగాన్ని కప్పి ఉంచుతారు. అందుకే చంద్ర వంకని శిరో మధ్య ప్రదేశం లో ధరించేవారు.

ఇక మెట్టెల విషయానికి వస్తే… గర్భకోశం లో ఉండే నరాలకూ కాలి వేళ్లలో ఉన్న నరాలకు సంబంధం ఉంది. అలానే స్త్రీ కామాన్ని అదుపు లో ఉంచుకోవడానికి కాలి వేలికి రాపిడి ఉండాలి. నేలను తాకరాదు. కామాన్ని పెంచే నరాలు కుడికాలి వేళ్లలో ఉంటాయి. మెడకు వేసుకునే హారాలు వల్ల తెలిసీ తెలియక చేసిన పాపాలను కూడా బంగారం పోగొడుతుంది. అలానే చెడు కలలు కూడా రాకుండా ఉంటాయి. గుండెల మీద బంగారం గుండెకి సంబంధించిన వ్యాధులను కూడా అరికడుతుంది.

TOP STORIES

సులభ్ కాంప్లెక్స్ లో మటన్ షాపు నిర్వహణ..!

మటన్, చికెన్ షాపులకు డిమాండ్ ఎక్కువనే చెప్పుకోవచ్చు. చుక్కా, ముక్కా లేనిదే కొందరి ముద్ద దిగదనే భావనలో బతికేస్తుంటారు. ఎన్ని బర్డ్ ఫ్లూలు వచ్చినా ఇంట్లో...