హైదరాబాద్: కరోనా కాలంలో కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రజల అవసరాన్ని ఆసరాగా మార్చుకుంటున్నారు. కరోనా కట్టడికోసం చేస్తున్న ప్రయత్నాలను అనువుగా మలుచుకుంటున్నారు. డబ్బులు దండుకుని ముఖం చాటేస్తున్నారు. మోసపోయామని తెలిసేలోపే చాప చుట్టేస్తున్నారు. ఇలాంటి ఘటన హైదరాబాద్‌లో జరిగింది. కేటుగాళ్ల బుట్టలో పడింది సాదాసీదా వ్యక్తులు కాదు. అన్ని రకాలుగా పేరు, తెలివి, పెద్దమనుషులుగా ఉన్న వాళ్లే మోసపోవడంతో ఆశ్చర్యం కలుగుతోంది.
కాగా వ్యాక్సిన్ వేయించుకునేందుకు సురేష్ బాబు మేనేజర్ ఆన్ లైన్‌లో పేరు రిజిష్ట్రర్ చేయించారు. ఆన్ లైన్‌లో ఈ విషయం తెలుసుకుని సురేశ్ బాబు మేనేజర్‌కు ఫోన్ చేశాడు. మీకు కరోనా వ్యాక్సిన్ ఇస్తానంటూ నమ్మబలికాడు. కేటుగాడిని నమ్మిన సురేశ్ బాబు.. అతనికి లక్ష రూపాయలు ట్రాన్స్ ఫర్ చేశారు. ఆ తర్వాత కేటుగాడు ఫోన్ లిఫ్ట్ చేయడంలేదు. అలా చాలాసార్లు ఫోన్లు చేశాడు. ఎంతకీ స్పందించకపోవడంతో జూబ్లీహిల్స్ పోలీసులకు సురేశ్ బాబు మేనేజర్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ కాల్ లిస్టును పరిశీలిస్తున్నారు. లోకేషన్ ద్వారా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.