ఐసీఐసీఐ బ్యాంక్ తమ కస్టమర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్ల కోసం తాజాగా కొత్త సర్వీసులుని తీసుకు వచ్చింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…
ఇన్‌స్టంట్ కార్డ్‌లెస్ ఈఎంఐ ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చింది ఈ బ్యాంక్. ఈకామర్స్ వెబ్‌సైట్లలో నిర్వహించే ఆన్‌లైన్ కొనుగోళ్లకు ఈ సౌకర్యం వర్తిస్తుంది. ప్రిఅప్రూవ్డ్ కస్టమర్లకు ఈ కొత్త సేవలు అందుబాటులో ఉంటాయి. బ్యాంక్ కస్టమర్లు రూ.5 లక్షల వరకు ట్రాన్సాక్షన్లను సులభంగానే ఈఎంఐ రూపంలోకి మార్చుకోవచ్చు.
దీని కోసం మీరు ఈకామర్స్ వెబ్‌సైట్ లేదా యాప్‌లో చెక్ ఔట్ సెక్షన్‌లో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, పాన్ కార్డు, ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా ఈఎంఐ ఫెసిలిటీ పొందొచ్చు. ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్, ల్యాప్‌టాప్స్, మొబైల్ ఫోన్స్, ట్రావెల్ వంటి కొన్ని కేటగిరిలపై ఈఎంఐ ఫెసిలిటీని కల్పిస్తోంది.
గత ఫెస్టివ్ సీజన్‌లో రిటైల్ స్టోర్లలో ఇన్‌స్టంట్ కార్డ్ లెస్ ఈఎంఐ ఫెసిలిటీ తీసుకు వచ్చామని అన్నారు. కస్టమర్ల నుంచి మంచి స్పందన రావడంతో ఇప్పుడు ఆన్‌లైన్ షాపింగ్‌కు కూడా ఈ సేవలు ఇస్తున్నామని ఐసీఐసీఐ బ్యాంక్ హెడ్ సుదిప్తా రాయ్ అన్నారు.
కార్డు అవసరం లేకుండా మొబైల్ నెంబర్, పాన్ నెంబర్ సాయంతో సులభంగానే షాపింగ్ చేయొచ్చు. షాపింగ్ చేసే వారు బిల్లు చెల్లింపు సమయంలో కార్డ్‌లెస్ ఈఎంఐ అనే ఆప్షన్‌ను పేమెంట్ ఆప్షన్‌గా ఎంచుకోవాలి. 5676766 నెంబర్‌కు కార్డ్‌లెస్ అని ఎస్ఎంఎస్ పంపిస్తే అర్హత తెలుసుకోవచ్చు అని కూడా తెలిపారు.