రైల్వే స్టేషన్ కి వెళ్తున్నారా…? ఫ్లాట్ ఫాం టికెట్ ధర పెరిగింది…!

-

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. సంక్రాంతి సెలవలు రావడంతో అందరూ సొంత ఊళ్లకు పయనం అవుతున్నారు. హైదరాబాద్ నుంచి ఉద్యోగులు, విద్యార్ధులు, వ్యాపారులు అందరూ సొంత ఊళ్లకు వెళ్తున్నారు. దీనితో రవాణా వ్యవస్థ సందడి సందడిగా ఉంది. బస్సులు, ట్రైన్స్ అన్ని కూడా ప్రయాణికులతో నిండిపోతు సందడి సందడిగా ఉన్న సంగతి తెలిసిందే.

ముఖ్యంగా ట్రైన్ ప్రయాణాలు చేసే వారు ముందుగా టికెట్లు బుక్ చేసుకుని సొంత ఊళ్లకు వెళ్ళిపోతున్నారు. బస్ లు దొరకని వాళ్ళు ట్రైన్ లో వెళ్ళడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపధ్యంలో సౌత్ ఇండియన్ రైల్వే వారికి బాడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండగ సందర్భంగా సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో రద్దీ ఎక్కువగా ఉండే సంగతి అందరికి తెలిసిందే కదా… దీనితో ఫ్లాట్ ఫాం టికెట్ ధరను పెంచేశారు అధికారులు.

ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనను విడుదల చేసారు. అనవసరంగా బయట వారు వచ్చి ఫ్లాట్ ఫాం మీద టాటాలు, బైబైలు చెప్పి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే అవకాశం ఉందని భావించిన రైల్వే శాఖ పది రూపాయలుగా ఉన్న ధరను 20 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. కాబట్టి వెళ్ళే ముందు ఆలోచించుకుని వెళ్ళండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version