ఉక్రెయిన్-ర‌ష్యా యుద్దంపై యూఎన్‌ఓలో చర్చ‌.. భార‌త్ సంచ‌లన‌ నిర్ణ‌యం

-

ఉక్రెయిన్ దేశంపై ర‌ష్యా యుద్దం ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. ఈ యుద్దాన్ని అప‌డానికి ప్ర‌పంచ దేశాలు తీవ్రంగా ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. ఐక్య రాజ్య స‌మితి కూడా యుద్దం నిలిపివేయాల‌ని ర‌ష్యా అధ్యక్షుడు పుతిన్ ను కోరింది. అయినా ఫ‌లితం లేదు. ఉక్రెయిన్ ను నిరాయుధాంగా చేయ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని ర‌ష్యా అధ్యక్షుడు పుతిన్ స్ప‌ష్టం చేశారు. అప్ప‌టి వ‌ర‌కు త‌మ సైనిక చ‌ర్య ఆగ‌ద‌ని కూడా తెల్చి చెప్పారు. కాగ ఉక్రెయిన్ పై ర‌ష్యా చేస్తున్న చ‌ర్య‌ల‌పై ఐక్య రాజ్య స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి శుక్ర వారం అత్య‌వ‌స‌రంగా స‌మావేశం అయింది.

ర‌ష్యా పై అమెరికా ప‌లు ప్ర‌తిపాద‌న‌లు పెట్టి.. ఓటింగ్ ను ప్రారంభించారు. అమెరికాకు అనుకూలంగా మొత్తం 11 దేశాలు ఓటు వేశాయి. కానీ ఈ ఓటింగ్ లో భార‌త్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ ఓటింగ్ కు భార‌త్ తో స‌హా చైనా కూడా దూరంగా ఉన్నాయి. అలాగే ర‌ష్యా వీటో వ‌ప‌ర్ తో వ్య‌తిరేకంగా ఓటు వేసింది. దీంతో అమెరికా ప్ర‌తిపాధించిన అంశాలు అన్ని కూడా వీగిపోయాయి. కాగ ఐక్య రాజ్య స‌మ‌తి భ‌ద్ర‌తా మండలిలో శాశ్వత స‌భ్య‌త్వం ఉన్న దేశాలు ఒక్క దేశామైన ఓటింగ్ కు వ్య‌తిరేకంగా ఓటు వేస్తే.. ఆ తీర్మానం వీగిపోతుంది. దీన్ని వీటో ప‌వ‌ర్ అంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version