“భీమ్లా నాయక్‌”రికార్డుల మోత..ఫస్ట్‌ డే కలెక్షన్లు ఎంతంటే

-

అజిత్ కుమార్ & కార్తికేయ గుమ్మకొండల ‘వలిమై’ విడుదలైన ఒక రోజు తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్‌ సినిమా నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కేవలం USA లోనే 400+ స్క్రీన్‌లలో అలాగే… మిగిలిన ప్రాంతాలలో 4000+ స్క్రీన్‌లలో విడుదలైంది. ఇటీవలి మీడియా నివేదికల ప్రకారం, ఈ చిత్రం అన్ని జిఎస్‌టి రిటర్న్‌లతో సహా రూ. 108 కోట్ల ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసిందని అంటే… విడుదలకు ముందే సూపర్ హిట్‌ అయినట్లు తెలుస్తోంది.


ఈ సినిమా కేవలం థియేట్రికల్ రన్‌లో దాదాపు 140 – 160 కోట్లు వసూలు చేస్తుందని అంచనా. ఇక విడుదలైన భీమ్లా నాయక్‌ సినిమా మొదటి రోజు దాదాపు రూ. 35-40 కోట్లు వసూలు చేయగా, ఓవర్సీస్ నుండి రూ. 50-55 కోట్లు వసూలు చేస్తుందని సమాచారం. అంతేకాకుండా, ఈ చిత్రాన్ని త్వరలో తెలుగు వెర్షన్‌తో పాటు హిందీలో కూడా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. అంతేకాదు ఓటీటీ హక్కులు రూ.100 కోట్లకు అమ్ముడు పోయే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version