Unstoppable With NBK : ఈ నెల 14న బాలయ్య-చంద్రబాబు షో

-

Unstoppable With NBK : నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేసిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK2’ మళ్లీ రాబోతోన్న సంగతి తెలిసిందే. ‘అన్ స్టాపబుల్ విత్ NBK2’ తో బాలయ్య అలరించేందుకు రాబోతున్నట్లు ఇప్పటికే ఓటిటి ప్లాట్ ఫామ్ ‘ఆహా’ ప్రకటించింది. ఇక ఈ షో ఎపిసోడ్‌ ఈ నెల 14వ తేదీను ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో…మొన్న ట్రైలర్‌ ను రిలీజ్‌ చేశారు.

ఇందులో బాలయ్య అది రిపోయే లుక్‌ మరియు డైలాగులతో ఆకట్టుకున్నారు. అయితే.. తాజాగా ఈ షో నుంచి మరో బిగ్‌ అప్డేట్‌ ను వదిలారు. బాలయ్య షోకు చంద్రబాబు రానున్నారని అధికారికంగా ప్రకటించేసింది ఆహా. అం తేకాదు.. చంద్రబాబుతోనే తమ సెకండ్‌ సీజన్‌ సెకండ్‌ షో ప్రారంభం అవుతున్నట్లు కూడా స్ప ష్టం చేసింది. అంటే.. ఈ నెల 14న బాలయ్య-చంద్రబాబు షో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ ద్వారా తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news