ఉత్తర్ ప్రదేశ్లో సమాజ్ వాదీ పార్టీకి షాక్… బీజేపీలో చేరిన మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కోడలు

-

ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది… ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఇటీవల బీజేపీ నుంచి ముగ్గురు మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు బయటకు వెళ్లారు. అఖిలేష్ యాదవ్ సమక్షంలో సమాజ్ వాదీ పార్టీలో చేరారు.

ఇదిలా ఉంటే బీజేపీలోకి కూడా వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా సమాజ్ వాదీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కోడలు, అఖిలేష్ యాదవ్ మరదలు అపర్ణాయాదవ్ బీజేపీలో చేరారు. అపర్ణా యాదవ్ అఖిలేష్ యాదవ్ సోదరుడు, ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ భార్య. ఈ పరిణామంలో సమాజ్ వాదీ పార్టీ ఢిఫెన్స్ లో పడింది. స్వయంగా ప్రధాన ప్రతిపక్ష నేత కుటుంబం నుంచే ఒకరు బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నేత డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ సమక్షంలో అపర్ణాయాదవ్ బీజేపీలో చేరారు.

అపర్ణా యాదవ్ 2017 రాష్ట్ర ఎన్నికలలో లక్నో కాంట్ నుండి సమాజ్ వాదీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే అప్పుడు బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ జోషి చేతిలో ఓడిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version