సంక్రాంతి పండుగ సమయంలో కోళ్ల పందేలతో పాటు పేకాట, క్యాసినో వంటి పోటీలు గుడివాడలో నిర్వహించారని గత కొద్ది రోజుల నుంచి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా గుడివాడలో జరుగుతున్న పేకాట. క్యాసినో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలోనే జరిగాయనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇదీల ఉండగా గుడివాడల క్యాసినో పోటీలు పెట్టడం పై రామ్ గోపాల్ వర్మ తన దైన శైలీలో ట్విట్టర్ ద్వారా స్పందించాడు.
గుడివాడలో క్యాసినో పోటీలు పెట్టడం పై మంత్రి కొడాలి నాని కి తన పూర్తి మద్దతు ఉంటుందని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. గుడివాడను అభివృద్ధి చేయడంలో భాగంగా క్యాసినో పోటీలు నిర్వహించేలా చేసిన మంత్రి కొడాలి నాని కి ధన్యవాదలు తెలిపారు. క్యాసినోకు వ్యతిరేకంగా మాట్లాడే వారు అంతూ.. పూర్వికులు అని వ్యాఖ్యానించాడు.అలాగే విరిని విడిచి పెట్టాలని రామ్ గోపాల్ వర్మ అన్నారు.