అప్గ్రేడ్ అయ్యానంటూ కొత్త కారు విశేషాలు తెలిపిన ఉపాసన.. ధర తెలిస్తే షాక్..!

-

అపోలో సంస్థల అధినేత ప్రతాపరెడ్డి మనవరాలు ఉపాసన గురించి గతంలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కానీ టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను వివాహం చేసుకున్న తర్వాత ఈమె పేరు ఎక్కడ చూసినా మారుమ్రోగుతోంది. అంతేకాదు ఉపాసన కోడలిగా తన బాధ్యతలు చేపడుతూనే మరొకవైపు అపోలో హాస్పిటల్స్ లో వైస్ చైర్మన్గా తన బాధ్యతలను నిర్వర్తిస్తోంది. కరోనా సమయంలో ఎంతోమంది ప్రజలకు ఆరోగ్యముపై అవగాహన కల్పించడమే కాకుండా సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీని కూడా సంపాదించుకుంది. అంతేకాదు ఎన్నో వృద్ధాశ్రమాలకు కూడా ఆమె ఆర్థిక సహాయం చేస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా కొత్త కారు కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఉపాసన తాజాగా ప్రముఖ కార్ల కంపెనీలలో ఒకటైన ఆడి కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రిక్ కారును ఆమె కొనుగోలు చేసినట్లు సమాచారం.. ఆడి e-tron అనే ఆడి ఎలక్ట్రిక్ మోడల్ ను ఈమె సొంతం చేసుకుంది. ఇకపోతే తాజాగా ఈ కారుకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను కూడా వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ. దీని మార్కెట్ విలువ కోటి 66 లక్షల రూపాయలని సమాచారం. ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా అప్డేట్ అవుతుందని అంటున్నారు అందుకే నేను కూడా అప్డేట్ అయ్యాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది.ఇక అలా అప్డేట్ అవ్వడంలో భాగంగానే ఆడి ఇ -ట్రాన్ కారును కొనుగోలు చేశాను అంటూ ఆమె తెలిపింది.

ఇక తన అన్ని అవసరాలకు ఈ కారు చాలా అనువుగా ఉంటుందని ,ప్రయాణానికి సైతం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ఆమె వెల్లడించింది. అంతేకాదు ఈ కారులో వాయిస్ కమాండింగ్ ఆప్షన్ ఎంతో బాగుందని తనను బాగా ఆకర్షించిందని కూడా ఆమె తెలిపింది. ఇకపోతే సినిమా రంగానికి చెందిన అన్ని విషయాలకి కూడా ఉపాసన దూరంగా ఉంటున్నారని, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఏదేమైనా రామ్ చరణ్ – ఉపాసన దంపతులు సినీ ఇండస్ట్రీకి ఆదర్శ దంపతులను చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version