మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ శనివారం బాలీవుడ్ సెలబ్రిటీస్‌ను కలిశారు. ఈ కలయికలో షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, కంగన రనౌత్, సోనమ్ కపూర్ తదితరులు హాజరయ్యాురు. ఈ కార్యక్రమంలో టెలివిజన్, సినిమా తారలు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు. అయితే మోడీపై చిరంజీవి కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల మండిపడ్డారు. బాలీవుడ్ ప్రముఖుల్ని ఆహ్వానించిన మోదీ.. దక్షిణాది తారలను ఎందుకు పిలవలేదన్నారు. దక్షిణాది అంటే మీకు ఎందుకంత వివక్ష అంటూ ప్రశ్నించారు.
ఇలాంటి కార్యక్రమానికి దక్షిణాది పరిశ్రమ నుంచి ఒక్క కళాకారుడిని కూడా ఆహ్వానించకపోవటంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. `డియరెస్ట్ నరేంద్ర మోడీ జీ. దక్షిణాది వారమైన మేము కూడా ప్రధానిగా మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం. అయితే కళాకారులతో జరిగిన సమావేశాన్ని కేవలం హిందీ నటీనటులకు మాత్రమే పరిమితం చేసి దక్షిణాది కళాకారులను పట్టించుకోకపోవటం బాధించింది` అంటూ ఉపాసన ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు సినీ అభిమానులతో పాటు సామాన్యుల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దుతు లభిస్తోంది. మరి ప్రధాని మోడీ ఈ ట్వీట్‌పై ఎలా స్పందిస్తారో చూడాలి.