కన్నడ చిత్ర పరిశ్రమ నుండి రిలీజై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేజీఎఫ్ గురించి అందరికీ తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ చిత్రం వసూళ్ళ వర్షం కురిపించింది. దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోనూ వసూళ్ళ పంట పండించింది. యశ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో ఎలివేషన్లని పీక్స్ లో చూపించారు. ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్ స్టార్ గా మారిపోయాడు. ఇండియాలో చెప్పుకోదగ్గ దర్శకులలో ఒకరిగా చేరిపోయాడు.
ఐతే ప్రస్తుతం కేజీఎఫ్ 2 తెరకెక్కుతుంది. ఆల్రెడీ చిత్రీకరణ చివరికి వచ్చిన ఈ సినిమా నుండి అప్డేట్ రానుంది. డిసెంబరు 21వ తేదీన కేజీఎఫ్ రెండవ అధ్యాయం నుండి అప్డేట్ వస్తుందట. ఈ మేరకు చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ఇప్పటి వరకు కేజీఎఫ్ సినిమా గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన వారందరి కోసం బహుమతిగా డిసెంబర్ 21వ తేదీన ఉదయం 10:08గంటలకి అన్ని అధికారిక ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా బయటకి వెల్లడి చేస్తారట.