వెంకటమాధవి హత్యకేసులో మిస్టరీ కొనసాగుతుంది. అయితే గత రెండు రోజులుగా ఈ వెంకటమాధవి హత్యా కేసు తెలుగు రాస్జ్త్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆమెను కుక్కర్ లో ఉడికించారు అనే విషయం విని బయట చాలా మంది షాక్ అయ్యారు. అయితే ఈ కేసులో క్లూస్ టీం సేకరించిన శరీర టిష్యూ, వెంట్రుకలు, రక్తపు మరకల వంటి ఆధారాలను FSLకు పంపారు పోలీసులు.
DNA మ్యాచింగ్ కొరకు ఆధారాలు పంపారు పోలీసులు. మాధవి పిల్లలు, తల్లి దగ్గర నుంచి శాంపిల్స్ సేకరించింది FSL. కొన్ని గంటల్లో పోలీసులకు DNA నివేదిక చేరనుంది. DNA నివేదికతో గురుమూర్తిపై చర్యలకు రంగం సిద్ధం అయ్యారు. అయితే మాధవి మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చారు పోలీసులు. భర్త గురుమూర్తి మాధవిని హత్య చేసినట్లుగా నిర్ధారణకు వచ్చారు. క్లూస్ టీం ఇచ్చిన ఆధారాలతో గురుమూర్తిపై హత్యకేసు నమోదు చేసారు.