నాకు ఒకే ఒక్క భార్య ఉంది అధ్యక్షా: వైఎస్ జ‌గ‌న్‌

-

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ మహిళలపై జరుగుతోన్న నేరాల గురించి ప్రస్తావించారు. దిశ కేసులో నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయంపై కూడా జగన్ మాట్లాడారు. ’26 ఏళ్ల దిశ.. టోల్ గేట్ వద్ద బైకు ఆపితే, ఆ బైకును పంక్చర్ చేసి, సాయం చేస్తున్నట్లు నటించి, అత్యాచారం చేసి కాల్చేశారు’ అని అన్నారు. ‘ఇటువంటి ఘటన జరిగినప్పుడు ఎలా స్పందించాలి? పోలీసులు ఎలా స్పందించాలి? రాజకీయ నాయకులు ఎలా స్పందించాలి? అన్న విషయం నాక్కూడా తెలిసింది. నిజంగా చాలా బాధ అనిపించింది. ఇలాంటి ఘటన మన రాష్ట్రంలో జరిగితే ఎలా స్పందించాలి? అన్న ప్రశ్న తలెత్తింది.

తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన చూసిన తర్వాత నేరస్థులను కాల్చేసినా తప్పులేదు అధ్యక్షా. నాకు కూడా ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు.. చెల్లి ఉంది. భార్య ఉంది.. నాకున్నది ఒక్క భార్యే అధ్యక్షా. వారికి ఏమైతే జరిగితే నేను ఏ విధంగా స్పందిస్తాను అధ్యక్షా?’ అని జగన్ వ్యాఖ్యానించారు. మన ఇళ్లల్లోని వారికి ఇటువంటి దారుణం జరిగితే ఎంతో తల్లడిల్లిపోతామని జగన్ చెప్పారు. నేరస్థులకు కఠిన శిక్షలు ఉండాలన్నారు. ‘నాకున్నది ఒక్క భార్యే అధ్యక్షా’ అని జగన్ వ్యాఖ్య చేసిన సమయంలో సభలోని ఎమ్మెల్యేలంతా నవ్వులు చిందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version