అయోధ్య తీర్పు బ్రేకింగ్‌: ఆ రెండు ఫిటిష‌న్లు కొట్టివేత‌

-

దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపబోయే కీలక అయోధ్య భూవివాదం కేసులో అత్యున్నత న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించనుంది. దీంతో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక అయోధ్య తీర్పును ఐదుగురు న్యాయ‌మూర్తులు చ‌ద‌వ‌డం కూడా స్టార్ట్ చేశారు. కోర్టు హాల్ నెంబ‌ర్ 1లో ఈ ఐదుగురు న్యాయమూర్తులు స‌మావేశ‌మ‌య్యారు. ఇక తాజా తీర్పులో భాగంగా షియా, అఖాడా వాద‌న‌ల‌ను సైతం ధ‌ర్మాస‌నం తోసిపుచ్చింది. అయోధ్య తీర్పు నేపథ్యంలో యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫైజాబాద్ జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు.

సుప్రీం తీర్పు నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. తీర్పు తర్వాత ఎక్కడా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎక్కువమంది పోలీసులను మోహరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ వివిధ రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో సుమారు 4వేల మంది పారా మిలిటరీ సిబ్బందిని మోహరించారు. అయోధ్యలో 144 సెక్షన్‌ కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news