బాబు మ‌ళ్లీ అభాసుపాల‌వుతారా… టీడీపీలో గంద‌ర‌గోళం..!

-

కింద‌ప‌డ్డా కూడా పైచేయి త‌న‌దే అనే టైపులో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని సొంత పార్టీ నాయ‌కులే.. చాటుమా టుగా టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై కామెంట్లు చేస్తున్నారు. సార్‌.. మ‌నం ఇప్ప‌టికైనా ఒప్పేసుకుందాం. ఏం త‌ప్పులు చేశామో తెలుసుకుని, వాటిని రిపీట్ చేయ‌కుండా.. కొత్తగా ఆలోచిద్దాం. అని ఇటీవ‌ల చంద్ర బాబు నిర్వ‌హించిన జిల్లాల స‌మీక్షా స‌మావేశాల్లో పార్టీ నాయ‌కులు చెప్పుకొచ్చారు. అయితే, వీటిని పైకి విని ఊ కొట్టిన చంద్ర‌బాబు త‌ర్వాత మాత్రం త‌న మానాన త‌నే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో ఇప్పుడు త మ్ముళ్లలో కొంద‌రు బాబు వైఖ‌రిని బ‌హిరంగంగానే త‌ప్పు ప‌ట్టే ప‌రిస్థితి వ‌చ్చింది.

తాజాగా రాష్ట్రంలో ఇసుక స‌మ‌స్య‌పై త‌న‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్న‌చంద్ర‌బాబు.. దీనిని త‌న‌కు రాజ‌కీ య వ‌న‌రుగా వినియోగించుకుంటున్న విష‌యం తెలిసిందే. ప్ర‌తి విష‌యాన్నీ రాజ‌కీయ కోణంలో చూడ డం అల‌వాటైన చంద్ర‌బాబుకు ఇసుక విష‌యంలోనూ ఇదే కోణం క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న దీనిని పెద్ద ఎత్తున త‌న‌కు అనుకూలంగా మార్చుకున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న కుమారుడు కొన్ని గంటల పాటు దీక్ష కూడా చేసారు. ఇక‌, చంద్ర‌బాబు రాష్ట్రంలో అనేక రూపాల్లో ఇసుక‌పై నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

ఆఖ‌రుకు జ‌న‌సేన‌తోనూ చేతులు క‌లిపి, విశాఖ‌లో నిర్వ‌హించిన లాంగ్ మార్చ్‌కు కూడా స‌హ‌కారం అందించారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు తాజాగా ఈ నెల 14న విజ‌య‌వాడ వేదిక‌గా ఇసుక దీక్ష పేరుతో ఉద‌యం 8 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు 12 గంట‌ల పాటు దీక్ష‌ను చేస్తున్నారు. ఇప్ప‌టికే దీనికి సంబంధిం చి పార్టీలో రెండు ర‌కాలుగా చ‌ర్చ సాగుతోంది. కొంద‌రు నాయ‌కులు ఈ కార్య‌క్ర‌మాన్ని త‌మ భుజాల‌పై మో సుకుపోతుండ‌గా.. మ‌రికొంద‌రు మాత్రం పెద‌వి విరుస్తున్నారు.

త‌మ్ముళ్ల‌లో పెద‌వి విరుపు క‌నిపిస్తోంది. మెజారిటీ నాయ‌కులు నిరాస‌క్త‌త వ్య‌క్తం చేస్తున్నారు. వాస్త‌వ ప‌రిస్తితి (వ‌ర‌ద‌లు, వ‌ర్షాల కార‌ణంగా న‌దుల్లో ఇసుక కొట్టుకుపోయింది. తీయ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది) తెలిసి కూడా ఇలా చేస్తే.. ప్ర‌జ‌ల్లో చుల‌క‌న అవుతామ‌ని అంటున్నారు. అయినా.. కూడా చంద్ర‌బాబు వీరి మాట‌ను వినే ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. దీంతో పార్టీలో కొంత గంద‌ర‌గోళం నెల‌కొంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Latest news