కన్నడ స్టార్ హీరో, దర్శకుడు ఉపేంద్ర దాదాపు 7 ఏళ్లు గ్యాప్ తీసుకుని, ఇప్పుడు యుఐ సినిమాలో నటించాడు. మనోహరం శ్రీకాంత్, కేపీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు ఉపేంద్ర సరసన ఈ సినిమాలో రేష్మ నానయ్య నటించారు. సెప్టెంబర్ లో ఈ సినిమా పోస్టర్ తో ఇంటర్నెట్లో సెన్సేషన్ ని క్రియేట్ చేశారు ఉపేంద్ర. తాజాగా సోమవారం, జనవరి 8 అంటే నేడు ఫస్ట్ లుక్ టీజర్ ద్వారా అంచనాలని తారాస్థాయికి తీసుకువెళ్లారు.
ఉపేంద్ర నటించిన డైరెక్ట్ చేసిన ఈ సినిమా టీజర్ ఒకసారి కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తోంది. సినిమాలో వినిపించే ఒక వాయిస్ తో టీజర్ స్టార్ట్ అయింది. గ్రాండ్ విజువల్స్ తో అదిరిపోయింది ఈ సినిమా. టీజర్ లో స్పెషల్ ఎఫెక్ట్స్, స్టన్స్ట్ చివర్లో ఉపేంద్ర ఎంట్రీ అన్నీ కూడా సరికొత్త అనుభూతిని కలిగించే విధంగా ఉన్నాయి. ఊహలకి అందని విధంగా సినిమా ఉంటుందని అంతా భావిస్తున్నారు. సుమారు 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెర మీదకు తీసుకువస్తున్నారట.