150 ఏళ్ళ తరువాత భారత్ లో ఒక మహిళకు ఉరిశిక్ష !

-

భారత దేశంలో 150 ఏళ్ళ అనంతరం తొలిసారి మహిళకు ఉరిశిక్ష విధించనున్నారు. యూపీలోని అమ్రోహా ప్రాంతానికి చెందిన షబ్నమ్‌ అనే మహిళ 2008లో ప్రియుడు సలీంతో కలిసి తన కుటుంబానికే చెందిన ఏడుగురిని అత్యంత పాశవికంగా గొడ్డలితో నరికి చంపింది. అయితే పెద్ద చదువులు చదివిన షబ్నమ్‌ ఐదో తరగతి ఫెయిలైన సలీం అనే వ్యక్తిని ప్రేమించింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఆమెని వారించారు. దీంతో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది.

ఆమె తల్లి, తండ్రి, సోదరులు అలా మొత్తం ఏడుగురిని నరికి చంపింది. ఈ కేసులో సలీం, షబ్నమ్‌ ఇద్దరికీ స్థానిక కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ క్రమంలో వారు సుప్రీం కోర్టు దాకా వెళ్ళారు. అక్కడ కూడా సమర్థించడంతో.. చివరి ప్రయత్నంగా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకున్నా, చివరికి అది కూడా తిరస్కరణకు గురయింది. దీంతో వీరిని ఉరి తీయడానికి యూపీలోని మథుర జైలు అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక షబ్నమ్‌ కంటే ముందు మహారాష్ట్రలోని అక్కాచెల్లెళ్లు సీమా గవిట్‌, రేణు షిండేలకు కూడా ఉరిశిక్ష పడింది. వీరికి కూడా ఉరిశిక్ష అమలు కావాల్సి ఉంది.  

Read more RELATED
Recommended to you

Latest news