UPSC CDS 2021: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు.. వివరాలివే..!

-

నిరుద్యోగులకు శుభవార్త. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్-CDS రెండో నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది. దీనితో ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. ప్రతీ సంవత్సరం కూడా రెండుసార్లు నోటిఫికేషన్ ని విడుదల చేస్తారు.

ఇప్పుడు రెండో నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తుల్నిస్వీకరిస్తోంది. ఈసారి 339 ఖాళీలను ప్రకటించింది. డిఫెన్స్‌లోని ఎయిర్‌ఫోర్స్, నేవీ, మిలిటరీ ఫోర్స్‌లో ఈ ఖాళీలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కూడా పలు పోస్టులున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

మొత్తం పోస్టులు 339 ఉండగా.. ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రడూన్- 100,
ఇండియన్ నావల్ అకాడమీ, ఎజిమల- 22 వున్నాయి. అలానే ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్- 32, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (పురుషులు)- 169, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మహిళలు)- 16.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2021 ఆగస్ట్ 24 సాయంత్రం 6 గంటలు. దరఖాస్తుల విత్‌డ్రా అయితే 2021 ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 6 సాయంత్రం 6 గంటలు. ఇక విద్యార్హత చూస్తే.. ఐఎంఏ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ-చెన్నై కోసం డిగ్రీ పాస్ కావాలి. ఇండియన్ నావల్ అకాడమీ కోసం ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. ఎయిర్ ఫోర్స్ అకాడమీ కోసం 10+2 స్థాయిలో ఫిజిక్స్, మ్యాథ్స్‌ తో పాటు డిగ్రీ పాస్ కావాలి. లేదా ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.

దరఖాస్తు ఫీజు రూ.200. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. వయస్సు 20 నుంచి 24 ఏళ్లు. 1998 జూలై 2 నుంచి 2003 జూలై 1 మధ్య జన్మించిన వారు అప్లై చేయడానికి అర్హులు. పరీక్షా కేంద్రాలు హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ. అలానే ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు https://upsc.gov.in/ వెబ్‌సైట్‌లో చూడచ్చు. https://upsconline.nic.in/ వెబ్‌సైట్‌ లో దరఖాస్తు చేయాలి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version