నిరుద్యోగులకి గుడ్ న్యూస్.. ఎయిర్‌ఫోర్స్‌లో ఖాళీలు: IAF AFCAT 2 రిక్రూట్మెంట్

-

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్-AFCAT 2 2021 నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.ఈసారి నోటిఫికేషన్ ద్వారా 334 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

 

ఈ నోటిఫికేషన్‌కు 2021 జూన్ 1 నుంచి జూన్ 30 వరకు దరఖాస్తు చేయొచ్చు. ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ బ్యాచెస్ (టెక్నికల్, నాన్ టెక్నికల్) లో కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఐఏఎఫ్. అర్హత, ఆసక్తి వున్నా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. https://www.careerindianairforce.cdac.in/ లేదా https://afcat.cdac.in/ వెబ్‌సైట్ల లో పూర్తి వివరాలని చూడచ్చు.

ఒకవేళ కనుక దీనిలో ఎంపికైతే హైదరాబాద్‌లోని దుండిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ ఇస్తారు. 2021 జూన్ 30 సాయంత్రం 5 గంటల్లోగా అప్లై చేయాలి. ఇక అర్హత విషయానికి వస్తే.. మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్‌తో 10+2 పాస్ కావాలి.

మూడేళ్ల డిగ్రీ 60 శాతం మార్కులతో పాస్ కావాలి. లేదా బీఈ, బీటెక్ నాలుగేళ్ల కోర్సు పాస్ కావాలి. వయస్సు 25 ఏళ్ల లోపు ఉండాలి. AFCAT 2 2021 అడ్మిట్ కార్డుల విడుదల, ఎగ్జామ్, కోర్సు ప్రారంభ తేదీలను త్వరలో చెప్పనుంది.

రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు వచ్చేసి రూ.250 గా వుంది. https://www.careerindianairforce.cdac.in/ లేదా https://afcat.cdac.in/ వెబ్‌సైట్ లో లాగిన్ అయ్యి అప్లై చేయాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version