RAPO20 మూవీలో బాలీవుడ్ బ్యూటీ ఐటెం సాంగ్

-

ఎనర్జిటిక్ స్టార్ రామ్-బోయాపటి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. రామ్ 20వ సినిమా ఇది. ఇందులో రామ్ కి జంటగా శ్రీలీల నటించనుంది. ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ షురూ అయింది. ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ‘ది వారియర్’ తర్వాత ఆయన.. రామ్ పోతినేనితో నిర్మిస్తున్న సినిమా ఇది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు బీ టౌన్ బ్యూటీ ఊర్వశి రౌటేలా. బాలీవుడ్ మూవీస్ తో బిజీగా ఉన్న ఊర్వశి అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తోంది. ఇప్పుడు తెలుగు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

ఇప్పటికే సంపత్ నంది దర్శకత్వంలో ‘బ్లాక్ రోజ్’ అనే సినిమాలో నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు బోయపాటి-రామ్ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకుంది. రామ్ తో తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఊర్వశి.

Read more RELATED
Recommended to you

Exit mobile version