‘పనికిరాని వ్యక్తులు అమెరికా రావొద్దు’.. అమెరికా కామర్స్ సెక్రటరీ సంచ‌ల‌నం

-

‘పనికిరాని వ్యక్తులు అమెరికా రావొద్దు.. అంటూ అమెరికా కామర్స్ సెక్రటరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. H1B అప్లికేషన్ ఫీజు పెంచే సమయంలో అమెరికా కామర్స్ సెక్రటరీ హోవర్డ్ వ్యాఖ్యలు చేశారు. ఐటీ కంపెనీలు అమెరికన్లనే నియమించుకోవాలి.. పనికి రాని వ్యక్తులను అమెరికాలోకి రావడాన్ని ఆపేయాల్సిందేనని బాంబ్ పేల్చారు హోవర్డ్.

US Commerce Secretary Howard's comments on H1B application fee hike
US Commerce Secretary Howard’s comments on H1B application fee hike

H1B వీసాలతో అమెరికా వెళ్లేది ఎక్కువగా భారతీయులేనని, హోవర్డ్ వ్యాఖ్యలు వారిని అవమానించే విధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఇది ఇలా ఉండ‌గా.. భారతీయులకు అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. హెచ్ -1బీ వీసాపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్-1బీ వీసా దరఖాస్తులపై వార్షిక రుసుంను లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం పెట్టారు. ఇకపై అమెరికా వేదికగా పని చేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాలని స్ప‌ష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news