అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల విజయం దాదాపు ఖరారైంది. దీంతో 47వ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం దాదాపు ఖరారైంది. కేవలం 3 ఓట్లకు దూరంలో ట్రంప్ నిలిచాడు.మ్యాజిక్ ఫిగర్ 270 కాగా.. ట్రంప్‌కు 267 ఎలక్టరోల్ ఓట్లు పోలయ్యాయి. డెమోక్రటిక్ అభ్యర్థి కమలాహ్యారిస్‌కు 214 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అధికారం చేజిక్కించుకోవడానికి స్వింగ్ రాష్ట్రాల్లోని కీలక రాష్ట్రాలైనా జార్జియా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా రాష్ట్రాలను ట్రంప్ సొంతం చేసుకున్నారు.
మరో నాలుగు స్వింగ్ స్టేట్స్‌లో రిపబ్లికన్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మరో 3 ఎలక్టోరల్ ఓట్లు సాధిస్తే అధ్యక్షుడిగా ట్రంప్ విజయం ఖరారైనట్లే.. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు సంబురాలు చేసుకుంటున్నారు. ఇక, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 214 ఎలక్టోరల్ సీట్లను మాత్రమే కైవసం చేసుకున్నారు. కాలిఫోర్నియా, ఓరెగన్, వాషింగ్టన్, న్యూ మెక్సికో, వర్జీనియా, ఇల్లినోయీ, న్యూజెర్సీ, మేరీల్యాండ్, వెర్మాంట్, న్యూయార్క్, కనెక్టికట్, డెలవేర్, మసాచుసెట్స్, రోడ్ ఐల్యాండ్, కొలరాడో, హవాయి, న్యూహ్యాంప్‌షైర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో డెమోక్రట్ అభ్యర్థులు లీడ్‌లో కొనసాగుతున్నారు.