అమెరికా ఎన్నికల ఫలితాలు చాలా ఉత్కంఠగా సాగుతున్నాయి. కొత్త అధ్యక్షుడి భవితవ్యాన్ని నిర్ణయించే స్వింగ్ స్టేట్స్ లో ఇప్పటివరకు రిపబ్లికన్లకు అనుకూలంగా ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం ఏడు రాష్ట్రాల్లో ఐదుచోట్ల ట్రంప్ ముందంజలో కొనసాగుతున్నాుు. ఒకచోట మాత్రమే కమలా హారిస్ జోరు కొనసాగుతోంది. మరో రాష్ట్రంలో ఫలితాలు ఇంకా వెలువడలేదు.ట్రంప్ ఇప్పటికే 230 ఎలక్ట్రోరల్ ఓట్లను సాధించారు. మొత్తం 272 ఎలక్ట్రోరల్ ఓట్లు సాధిస్తే ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు కానున్నారు.
స్వింగ్ స్టేట్స్లో మరికొన్ని ఎలక్ట్రోరల్ ఓట్లు ఆయన పక్షాన నిలిచినా శ్వేతసౌధం మెట్లెక్కడం ఖాయంకానుంది. పెన్సిల్వేనియాలో తొలుత కమలా హారిస్ ఆధిక్యంలో ఉండగా..కొద్దిసేపటి క్రితమే ట్రంప్ ఆమెను దాటేశారు. జార్జియా, విస్కాన్సిన్, మిషిగన్, నార్త్ కరోలినా, ఆరిజోనాలో ట్రంప్ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతుండగా.. నెవడా రాష్ట్రంలో ఇంకా ఫలితాలు వెల్లడి కాలేదు. నేటి సాయంకాలం వరకు అమెరికా అధ్యక్షుడు ఎవరనేది తెలిసిపోనుంది.