డేంజర్ లో ఢిల్లీ నగరం ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్..421కి పడిపోయింది. ఢిల్లీలో రోజు రోజుకూ గాలి నాణ్యత క్షీణిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 421కి పడిపోయింది. కాలుష్యానికి తోడు యమునా నది నీటి నుంచి వస్తున్న దుర్గంధంతో ఢిల్లీ వాసులు…ఇబ్బంది పడుతున్నారు. వాజీపూర్ బోర్డర్ నుంచి డ్రైనేజీ నీటిని యమునాలోకి విడుదల చేయడంతో నీటి కాలు ష్యం..పెరుగుతోంది.
యమునాలో నురగను కంట్రోల్ చేసేందుకు డీ- ఫోమర్ అనే ద్రావణాన్ని వినియోగిస్తోంది ఢిల్లీ ప్రభుత్వం. కార్తీక మాసం నేపథ్యంలో యమునా నదిలో స్నానాలు చేయవద్దని ఢిల్లీ ప్రజలకు సూచించిన అధికారులు.. ఈ మేరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరో నెల రోజుల పాటు పరిస్థితులు ఇలాగే ఉంటాయని అధికారులు చెబుతున్నారు.