నవ్వుతూ ఉన్నా ఆనందంగా లేరని చెప్పడానికి పనికొచ్చే సంకేతాలు..

-

ఆనందం అనేది జీవితాశయం కావాలి. నీ జీవితంలో ఆనందం అనేది అతిధి కాకూడదు. జీవితమే ఆనందం కావాలి. అలా లేనపుడు ఎన్ని సాధించినా, ఎంత పోగొట్టుకున్నా పెద్ద తేడా ఉండదు. చాలామంది నవ్వుతూ కనిపిస్తారు. కానీ లోపల్లోపల బాధపడుతూ ఉంటారు. కారణమేంటో కొన్నిసార్లు తెలియదు కూడా. కానీ బాధపడుతూ ఉంటారు. సైకలాజికల్ గా మీరు ఆనందంగా లేరని చెప్పడానికి పనికొచ్చే కొన్ని సంకేతాలను ఇక్కడ తెలుసుకుందాం.

మీరు గతంలో బ్రతుకుతారు

గతం అనేది మన జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఆనందంగా బ్రతకలేని వారు గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అప్పుడు అలా జరిగుండకపోతే బాగుండేది. అలా ఎందుకు జరిగింది అన్న ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. విషపూరిత బాల్యం, తీవ్రమైన ఆర్థిక నష్టం మొదలగునవన్నీ ప్రస్తుతంలో ఆనందాన్ని ఆపేస్తాయి.

ఆగ్రహావేశాల వలయంలో బ్రతుకుతారు

జీవితంలో పగలు ప్రతీకారాలు పెట్టుకోవడం వల్లపెద్దగా జరిగే లాభమేమీ ఉండదు. ఒకరిపై కోపం పెట్టుకుని దాని కోసమే బ్రతుకుతూ ఉన్న జీవితాన్ని పాడుచేసుకోవడం వ్యర్థం. మీరు ఆనందంగా లేకపోవడానికి పగ, ప్రతీకారాల గురించి ఆలోచించడం కూడా ఒక కారణం. ఒంటి మీద పడ్ద వానచినుకులు కొద్దిసేపు మాత్రమే మనుషుల్ని తడిగా ఉంచుతాయి. అవతలి వారిపట్ల మీ కోపం కూడా అలాగే ఉండాలి. లేదంటే తడిసి ముద్దయ్యేది మీరే.

ఎవరేమనుకుంటారో అని ఎక్కువ బాధపడతారు

అవతలి వారు నీ గురించి మాట్లాడుకుంటారన్న ఆలోచనను నువ్వు ఆపేయాలి. ఎందుకంటే వారు మాట్లాడుకోవడాన్ని నువ్వు ఆపలేవు. కొన్ని కొన్ని సార్లు నువ్వు కూడా అవతలి వారి గురించి మాట్లాడుకుంటావు. కాబట్టి ఏదీ ఎక్కువ ఆలోచించవద్దు.

మిమ్మల్ని, మీ నిర్ణయాలను పెద్దగా నమ్మకపోవడం

ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు అవతలి వారి మీద ఆధారపడడం, మీ నిర్ణయాలపై మీకు నమ్మకం లేకపోవడం మొదలగునవన్నీ మీరు ఆనందంగా లేరని సూచిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news